ఏపీలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల

  • నిన్న విడుదల కావాల్సిన ఫలితాలు
  • వాయిదా వేసిన ప్రభుత్వం
  • టెన్త్ రిజల్ట్స్ కు కొత్త ముహూర్తం
  • సోమవారం ఫలితాలు విడుదల చేయనున్న బొత్స
ఏపీలో నిన్న విడుదల కావాల్సిన పదో తరగతి పరీక్ష ఫలితాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొన్ని అనివార్య కారణాలతో విడుదల చేయలేకపోతున్నామని ప్రభుత్వం చెప్పినప్పటికీ, విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో, టెన్త్ రిజల్ట్స్ విడుదలకు ప్రభుత్వం కొత్త ముహూర్తం సిద్ధం చేసింది. 

రేపు (జూన్ 6) మధ్యాహ్నం 12 గంటలకు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం www.results.bse.ap.gov.in లో చూడాలని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

10th Class
Results
Botsa Satyanarayana
Andhra Pradesh

More Telugu News